స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతటి దుర్మార్గమైన, దరిద్రమైన ఎన్నికలను ఎన్నడూ చూడలేదని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆక్షేపించారు. కడపజిల్లాలో వైకాపా నాయకుల దౌర్జన్యం, పోలీసుల బెదిరింపులతో తెదేపా అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. రాయచోటి, మైదుకూరు, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులను వైకాపా నాయకులు భయబ్రాంతులకు గురిచేశారని తెదేపానేతలు ఆరోపించారు. రైల్వేకోడూరులో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను చించి వేస్తున్నారని అధికారులకు విన్నవించినా ఫలితం లేదని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు అన్నారు. తాను పెన్ కెమెరాతో లోపల జరిగిన ఘటనలను చిత్రీకరించానని... అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు.
రద్దు చేసి మళ్లీ జరిపించాలి...
ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయవద్దని ముఖ్యమంత్రి ఓ వైపు చెబుతుంటే... జిల్లాల్లో ఆ పార్టీ నాయకులే నామినేషన్లు ఉప సంహరణ కోసం డబ్బులు పంపిణీ చేస్తున్నారని ప్రొద్దుటూరు తెదేపా నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేయడం కాదని... రద్దు చేసి మళ్లీ ఎన్నికలను జరిపించాలని డిమాండు చేశారు.
ఇవీ చదవండి...'స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మెుదటి నుంచి చేపట్టాలి'