Fake land Business: వైఎస్సార్ జిల్లా బద్వేలులో సంచలనం సృష్టించిన నకిలీ భూదందాలో కీలక పాత్ర పోషించిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో నకిలీ పత్రాలు, రెవెన్యూ సీళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పాత డీకేటీ పత్రాలకు నకిలీలను సృష్టించి.. వాటిని విక్రయించేవారని పోలీసులు తెలిపారు. కొంత కాలంగా ఇలా నకిలీ పత్రాలతో భూదందాలు సాగిస్తున్నారని వెల్లడించారు. రమణారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విచారణ చేపట్టగా ఈ విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి సీళ్లు, నకిలీ అనుబంధ ఫారాలు, నకిలీ ఇంటి స్థలాల పట్టాలు, పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో తప్పించుకున్నవారి కోసం గాలింపు చేపడుతున్నట్లు వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఇవీ చదవండి: