కడప డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ సోమవారం రాత్రి 11 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులో 35 మంది ప్రయాణికులతో కడప నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లాడు. బస్సును ఇష్టారీతిన వేగంగా నడుపుతుండటంతో ప్రయాణికులు ఆయన్ను మందలించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ సమీపంలో బస్సును రోడ్డుపై వదిలేసి డ్రైవర్ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆర్టీసీ అధికారులు, పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేయగా... వారు మరో డ్రైవర్‌ను పంపి బస్సును గమ్యస్థానానికి చేర్చారు.
ఈ విషయంపై ఆర్టీసీ వైయస్‌ఆర్ జిల్లా రవాణా అధికారి గోపాల్‌రెడ్డిని వివరణ కోరగా.. డ్రైవర్ మార్గమధ్యలో బస్సును నిలిపేసి వెళ్లింది వాస్తవమేనన్నారు. ఇప్పటికీ అతని ఆచూకీ తెలియరాలేదని.. ఏం జరిగిందో తెలుసుకుంటున్నామన్నారు.
ఇవీ చదవండి: