Protest: గ్రామానికి వెళ్లే దారిని బాగు చేయాలని కోరుతూ వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీకి చెందిన వార్డు సభ్యుడు రాజేష్ పొర్లుదండాలతో నిరసన తెలిపారు. జగనన్న రోడ్డు వేయాలంటూ నినాదాలు చేస్తూ పొర్లు దండాలు పెట్టారు. 40ఏళ్ల కిందట గ్రామం ఏర్పడినా దారి అభివృద్ధికి నోచుకోకపోవడం.. వర్షం పడితే రాకపోకలకు కష్టంగా మారడంతో వార్డు సభ్యుడైన రాజేష్ యువకులతో కలిసి దారిలో పొర్లుతూ నిరసన తెలిపారు.
ఇవీ చదవండి: