అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తున్న తరుణంలో అధికారుల సమీక్ష సమావేశానికి విలేకరులను అనుమతించకపోవడం సరైనది కాదని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి అన్నారు. కడప కలెక్టరేట్లో నివర్ తుపానుపై ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
విలేకరులు ఫొటోలు తీసుకొని 2 నిమిషాల అనంతరం వెళ్లిపోవాలని మంత్రి అనడంపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్పందించారు. విలేకరులు లేకుంటే తాను సమావేశం నుంచి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య కూర్చుని సమావేశాలు నిర్వహించడం సరైనది కాదని.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే విలేకరులను సమావేశానికి అనుమతించకపోవడం మంచిది కాదని వాదించారు. జర్నలిజం లేని సమావేశం ఎక్కడా ఉండదన్నారు. అనంతరం మంత్రి విలేకర్లను సమావేశానికి అనుమతించారు.
ఇవీ చదవండి..
పద్మావతి మహిళా వర్శిటీలో రేపు జరగాల్సిన పీజీ సెట్ కౌన్సెలింగ్ 18కి వాయిదా