అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను కాకుండా రాయచోటిని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లి గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. పుల్లంపేట మండలం ప్రధాన రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వైకాపాకు పార్టీకి సెలవు ప్రకటిస్తున్నామని తెలిపారు. రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజంపేటనే జిల్లా కేంద్రంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: వెనుకబడిన ప్రాంతం కాబట్టే రాయచోటి జిల్లా కేంద్రమైంది: శ్రీకాంత్‌రెడ్డి
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!