ETV Bharat / city

ఈనెల 27నుంచి జనవరి 2 వరకు పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు

కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 27నుంచి 2021 జనవరి 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. ఉరుసు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముస్లిం మతపెద్దలు, జిల్లా ఉన్నతాధికారులతో చర్చించారు.

pedda dargah urus at kadapa
ఈ నెల 27నుంచి జనవరి 2 వరకు కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు
author img

By

Published : Dec 5, 2020, 9:04 PM IST

ఈ నెల 27నుంచి 2021 జనవరి 2వ తేదీ వరకు కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. ఉరుసు నిర్వహణపై కడప అమీన్​పీర్ పెద్ద దర్గాలో ముస్లిం మత పెద్దలు, జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనల మేరకు ఈ ఏడాది తక్కువ మందితోనే ఉరుసు ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని మత పెద్దలు పాటించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను అంజాద్ బాషా ఆదేశించారు.

ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉరుసు ఊరేగింపులు, గంధం మహోత్సవాలను వీధుల గుండా కాకుండా కేవలం దర్గాకే పరిమితం అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ఈ సమావేశంలో అమీన్​పీర్ పెద్ద దర్గా పీఠాధిపతి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ హరికిరణ్, రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కృషి: మంత్రి అవంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.