కేంద్ర ప్రభుత్వం కసాయి పాలన సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో మాట్లాడిన తులసిరెడ్డి... భాజపా, వైకాపాలు రాష్ట్రానికి ద్రోహం చేశాయని మండిపడ్డారు. కడప ఉక్కు కర్మాగారం, బుందేల్ ఖండ్ తరహాలో అభివృద్ధి ప్యాకేజీ నిధులు, ప్రత్యేక హోదా కొత్త రైలు మార్గాలు వంటి హామీలను కేంద్ర, రాష్ట్రాలు మరిచాయని విమర్శించారు. ఫ్యాను గుర్తుకు ఓటేస్తే ఇంటిలో ఫ్యాను కూడా తిరగదని ఎద్దేవా చేశారు.
కేంద్రప్రభుత్వం కసాయి పాలన సాగిస్తోంది. భాజపా, వైకాపాలు రాష్ట్రానికి ద్రోహం చేశాయి. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించారు. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాయి.
తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు
ఇదీచదవండి: సీఎం జగన్‌ను ఎన్‌డీఏలో చేరాలని కోరుతున్నా: కేంద్రమంత్రి అథవాలే