ETV Bharat / city

చనిపోయిన బాబుకు వైద్యం.. బంధువుల ఆందోళన - medical crime at kadapa

కడపలోని చెన్నై ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాలుగు రోజుల మగశిశువు మృతికి ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నే చనిపోతే చెప్పకుండా దాచారని శిశువు బంధువుల ఆరోపిస్తున్నారు. కడపలోని చెన్నై ఆస్పత్రిపై శిశువు బంధువులు రాళ్లదాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.

chennai children hospital give medication to dead boy at kadapa
బంధువుల ఆందోళన
author img

By

Published : Oct 9, 2020, 8:58 AM IST

Updated : Oct 9, 2020, 9:19 AM IST

చనిపోయిన బాబుకు వైద్యం అందించి మోసం చేశారని కడప చెన్నై పిల్లల ఆస్పత్రి వద్ద బాబు బంధువులు ఆందోళన చేశారు. బాబు చనిపోయి రెండు రోజులైనా తమకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప రవీంద్రనగర్​కు చెందిన ఆన్సర్ బాషా, షబానా దంపతులకు నాలుగు రోజుల క్రితం బాబు పుట్టాడు. అతనికి ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో కడపలోని చెన్నై చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించారు. రోజుకు పది వేల రూపాయల విలువ చేసే 3 ఇంజక్షన్లు ఇచ్చారు. అయినప్పటికీ మార్పు రాలేదు. ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం బాబు మృతి చెందాడు. ఆ విషయాన్ని వైద్యులు తల్లిదండ్రులు, బంధువులకు చెప్పలేదు. ఈరోజు తెల్లవారుజామున బాబు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో బంధువులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే రిమ్స్​కు తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షించి రెండు రోజుల క్రితమే బాబు చనిపోయాడని ధ్రువీకరించారు. చనిపోయిన వారికి చికిత్స ఎలా చేశారని ప్రశ్నించారు. వెంటనే బంధువులు చెన్నై ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రిపై రాళ్లదాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.

ఇదీ చదవండి: కీలక దశకు సీఎంఆర్​ఎఫ్​ కుంభకోణం కేసు

Last Updated : Oct 9, 2020, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.