ETV Bharat / city

ANWAR BASHA: 'అక్బర్​బాషా ఆరోపణలు అవాస్తవం' - kadapa district crime

పోలీసులు వేధిస్తున్నారంటూ.. సోషల్​ మీడియాలో వైరల్ అయిన వీడియోలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్​బాషా బంధువు, అన్వర్ బాషా అన్నారు. నిబంధనల ప్రకారం అక్బర్​కు ఆ స్థలంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

వైరల్ అయిన వీడియో అవాస్తవమని సమావేశం
వైరల్ అయిన వీడియో అవాస్తవమని సమావేశం
author img

By

Published : Sep 11, 2021, 7:11 PM IST

కడప జిల్లా మైదుకూరు సీఐ వేధిస్తున్నాడంటూ.. ఫేస్​బుక్​లో అక్బర్​బాషా పోస్ట్ చేసిన వీడియోలో ఆరోపణలు అవాస్తవమని దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అన్వర్ బాషా అన్నారు. గ్రామానికి చెందిన ఖాసీంబీకి సంతానం లేకపోవడంతో తన అన్న కుమార్తె అయిన అప్సానాను పెంచి పెద్ద చేసినట్లు వెల్లడించారు. దీంతో అప్సానా భర్త అక్బర్ బాషా ఖాసీంబీకి చెందిన భూమిని దౌర్జన్యంగా రాయించుకున్నారని ఆరోపించారు.

ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. సివిల్ పంచాయితీ కావడంతో తాము జోక్యం చేసుకోలేమని చెప్పినట్లు వివరించారు. కానీ అక్బర్ బాషా మాత్రం తమకు అన్యాయం జరిగిందని, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారన్నారు. నిబంధనల ప్రకారం అక్బర్​కు ఆ స్థలంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

గన్నవరం విమానాశ్రయంలో నిలిచిన ఎయిరిండియా విమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.