గుంటూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. అధికారులు నిర్దేశించిన విధంగా వ్యర్థాలను తడి, పొడిగా విభజించి పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. ప్రజలు తడి వ్యర్థాలతో హోంకంపోస్ట్ తయారు చేస్తే... నగరపాలక సంస్థకు పని భారం తగ్గుతుందని వివరించారు. పారిశుధ్య సిబ్బంది సేకరిస్తున్న తడిపొడి చెత్తను ప్రత్యక్షంగా పరిశీలించి వారిని అభినందించారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల వివరాలు, వాటిని అభివృద్ధి చేయడానికి అంచనాలను సిద్ధం చేసి అందజేయాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాలను ఎలా అభివృద్ధి చేయవచ్చో పూర్తి అంచనాలను ఇవ్వాలని సూచించారు. నగర పరిధిలో నగర పాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌ల వివరాలు అందజేసిస్తే... గుంటూరు నగరానికి రెవెన్యూ జెనరేట్ అయ్యేలా అభివృద్ధి కార్యక్రమాలు చేసే వీలు ఉంటుందని వివరించారు.
ఇదీ చదవండీ... మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇచ్చి ఆదుకోవాలి: పవన్