ETV Bharat / city

గుంటూరులో 'వ్యర్థాలపై యుద్ధం'

author img

By

Published : Dec 7, 2020, 3:29 PM IST

వ్యర్థాలపై యుద్ధం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం. ఈ అవగాహన ర్యాలీని ఎంపీలు మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి... జిల్లా కలెక్టర్​తో కలిసి ప్రారంభించారు.

vyardhala pai yudham
vyardhala pai yudham

గుంటూరులో 'వ్యర్థాలపై యుద్ధం' కార్యక్రమాన్ని ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి ప్రారంభించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్​తో కలిసి ఎంపీలు జెండాలు ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. పారిశుద్ధ్యం పరిరక్షణ లక్ష్యంగా వ్యర్థాలపై యుద్ధం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎంపీ మోపిదేవి అన్నారు. స్వచ్ఛ గుంటూరు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛభారత్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు.

ఇదీ చదవండి

విలేకర్లను అనుమతించకపోతే నేనూ వెళ్లిపోతా: వైకాపా ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.