ETV Bharat / offbeat

చపాతీలు పొంగట్లేదా? - ఇలా చేస్తే టీవీ యాడ్స్​లో మాదిరి ఉబ్బుతాయి! - గంటలపాటు సాఫ్ట్​గా ఉంటాయి - How to Make Soft Chapati at Home

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How to Make Soft Chapati : చపాతీలు టీవీ యాడ్స్​లో చూపించినట్టుగా.. మెత్తగా, మూడు వేళ్లతో తుంచేలా రావాలని అందరూ ఆశిస్తారు. కానీ.. సాధ్యం కాదు. గట్టిగానే వస్తుంటాయి. అయితే.. కొన్ని చిట్కాలు పాటిస్తే చపాతీలు పొంగి మృదువుగా, దూదిలాగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్​ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

How to Prepare Chapati
How to Make Soft Chapati at Home (ETV Bharat)

How to Make Soft Chapati : ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గేందుకు.. చపాతీని చాలా మంది బెస్ట్ ఆప్షన్​గా ఎంచుకుంటున్నారు. అయితే.. చపాతీలు మెత్తగా ఉంటేనే టేస్ట్​ బాగుంటాయి. కానీ చాలా మందికి వాటిని మెత్తగా చేయడం రాదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. గట్టిగానే వస్తుంటాయి. మీరు కూడా ఇలా అలసిపోయారా? అయితే.. ఈ టిప్స్ పాటిస్తే.. చపాతీలు పొంగడంతోపాటు గంటలపాటు కూడా చాలా సాఫ్ట్​గా ఉంటాయని అంటున్నారు కుకింగ్ ఎక్స్​ పర్ట్స్. మరి ఆ టిప్స్​ పాటిస్తూ చపాతీలు ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి - 2 కప్పులు

ఉప్పు - రుచికి సరిపడా

నీరు - సరిపడా

నూనె - సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​ తీసుకుని అందులోకి గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కేవలం చేతివేళ్లతో మాత్రమే కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తానికి నీళ్లు కలిపి.. ఆ తర్వాత అరచేతితో ప్రెస్​ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సుమారు 7 నుంచి 10 నిమిషాల పాటు పిండి ముద్దను సాగదీస్తూ కలుపుకుంటే పిండి చాలా సాఫ్ట్​గా వస్తుంది.
  • ఆ తర్వాత ఆ పిండిలోకి 2 టీ స్పూన్లు నూనె వేసి మరో 4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిపై మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
  • అనంతరం పిండిని మరో రెండు నిమిషాలు నిధానంగా కలుపుకోవాలి. అనంతరం వాటిని సమాన ఉండలుగా చేసుకుని అవి ఆరిపోకుండా పైన మూత పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక ఉండను తీసుకుని పొడి గోధుమ పిండిలో ముంచి చపాతీ పీట మీద రౌండ్​గా వచ్చేలా రుద్దుకోవాలి. ఆ తర్వాత ఆ చపాతీపై నూనె రాసి మధ్యలోకి ఫోల్డ్​ చేసుకోవాలి. మళ్లీ ఆ లేయర్​పై నూనె రాసి మళ్లీ ఫోల్డ్​ చేసుకోవాలి. అప్పుడు అది ట్రైయాంగిల్​ షేప్​లో వస్తుంది.
  • ఇప్పుడు ఆ చపాతీని మళ్లీ పొడి గోధుమ పిండిలో ముంచి రౌండ్​గా రోల్​ చేసుకోవాలి. రోల్​ చేసేముందు పిండి మధ్యలో రుద్దకుండా పిండి చివర్లు రుద్దుతూ రౌండ్​ షేప్​ వచ్చేవరకు రోల్​ చేసుకోవాలి. అయితే ఇక్కడ చపాతీ అనేది మందంగా లేదా పల్చగా కాకుండా మీడియం థింక్​నెస్​ వచ్చేలా తాల్చుకోవాలి.
  • ఇలా చేసిన చపాతీని ఓ ప్లేట్​లోకి తీసుకుని.. అది ఆరిపోకుండా ఏదైనా క్లాత్​ కప్పాలి. ఇలా అన్ని ఉండలను చపాతీలుగా ఒత్తుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద పాన్​ పెట్టి బాగా హీట్​ చేసుకోవాలి. పెనం హీటెక్కిన తర్వాత చపాతీ వేసి ఓ 10 సెకన్లు పాటు కాల్చుకోవాలి.
  • ఆ తర్వాత రెండో వైపు తిప్పి మరో 10 సెకన్ల పాటు కాల్చుకోవాలి. ఈ సమయంలో చపాతీలు పొంగుతుంటాయి. అప్పుడు చపాతీ రెండు వైపులా నూనె అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి.
  • ఇలా కాలిన చపాతీని హాట్​ బాక్స్​లో పెట్టి మూత పూర్తిగా పెట్టకుండా కొద్దిగా గ్యాప్​ ఇచ్చి పెట్టాలి. ఇలా అన్నింటిని చేసుకుని తీసుకుంటే.. గంటలపాటు కూడా సూపర్​సాఫ్ట్​గా ఉండే చపాతీలు రెడీ. బరువు తగ్గేందుకు చపాతీ తినే వారు నూనె లేకుండా కాల్చుకోవచ్చు. ఇలా కాల్చుకున్నా మెత్తగానే ఉంటాయి..

చపాతీలలో ఈ పిండి కలిపితే అద్భుతం జరుగుతుంది - మీ ఒంట్లో కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది!

జొన్న రొట్టెలు చేయడం రావట్లేదా? - ఈ సీక్రెట్‌ టిప్స్‌ పాటిస్తూ చేస్తే చపాతీ కంటే సూపర్​ సాఫ్ట్​!

చపాతీలు మృదువుగా రావాలా? - పిండిలో ఇవి కలిపితే చాలు - భలే స్మూత్​గా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.