HC on Raghurama Krishna Raju Case in AP : కస్టడీలో ఉన్న నిందితులకు ఎలాంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులకు ఏమైనా జరిగితే ఆ కేసు దర్యాప్తు అధికారి వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో చిత్రహింసలకు గురిచేసిన సందర్భంలో ఆ కేసు ఐఓగా సీఐడీ అదనపు ఎస్పీగా విజయ్‌పాల్ వ్యవహరిస్తున్నారని ఆయనే ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చేయండి - అధికారులకు హైకోర్టు ఆదేశం - Neha Reddy Illegal Construction
2021 మేలో తనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, అరెస్టు చేసి సీఐడీ అధికారులు రాత్రంతా కస్టడీలో నిర్బంధించి హతమార్చేందుకు యత్నించారని రఘురామకృష్ణరాజు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్, తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విజయ్‌పాల్ ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ వీఆర్‌కే.కృపాసాగర్ ఈనెల 24న నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.
'ఆ ప్లెక్సీలు తొలగించాల్సిన బాధ్యత అధికారులదే' - HC on Unauthorised Hoardings