ETV Bharat / city

ఆ 72 మందికి కరోనా వైరస్ ఎలా సోకిందో..? - corona cases in ap latest news

పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చినవారు, ఇంటింటి సర్వే, ఇతర రకాలుగా గుర్తించిన వారు కాకుండా మరో 72 మందికి వైరస్‌ ఎలా సోకిందన్న వివరాల కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తోంది. కరోనా వైరస్‌ 72 మందికి ఎలా సోకిందో తెలియట్లేదు.

Unknown Positive Cases in Andhra Pradesh
కరోనా వైరస్
author img

By

Published : Apr 25, 2020, 7:47 AM IST

రాష్ట్రంలో గురువారం రాత్రి వరకు 893 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన 14 మంది, దిల్లీ నుంచి వచ్చిన 258 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరి నుంచి ప్రైమరీ కాంటాక్ట్‌ కింద 301, సెకండరీ కాంటాక్ట్‌ కింద 109 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు.

పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చినవారు, ఇంటింటి సర్వే, ఇతర రకాలుగా గుర్తించిన వారు కాకుండా మరో 72 మందికి వైరస్‌ ఎలా సోకిందన్న వివరాల కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి పెరిగాక విధుల్లో ఉన్న పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగుల్లో 10 మందికి పాజిటివ్‌ వచ్చింది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన 22 మంది (వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది) వైరస్‌ బారినపడ్డారు. వీరిలో అనంతపురం జిల్లాలో 8, గుంటూరు-7, కర్నూలు-3, నెల్లూరు-2, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరి వంతున ఉన్నారు.

రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చి, వైరస్‌కు గురై 15 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్లలో 130 మందికి వైరస్‌ సోకింది. వీరు కర్నూలు-62, చిత్తూరు-31, కృష్ణా-23, గుంటూరు-8, ఇతర జిల్లాల్లో మరికొందరు ఉన్నారు. ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత లక్షణాలు గుర్తించి పరీక్షలు చేయించగా ఏడుగురికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. వీరిలో ముగ్గురు గుంటూరు జిల్లావారే.

కర్నూలులోనే ఎక్కువ..!

అనుమానిత లక్షణాలు ఉన్నవారిని పరీక్షించగా పాజిటివ్‌ అని తేలిన తర్వాత వారు ఎవరెవర్ని కలిశారో అధికారులు గుర్తిస్తున్నారు. దీనివల్ల వైరస్‌ ఎవరి వల్ల వచ్చిందో తెలుస్తోంది. మిగిలిన 72 మందికి వైరస్‌ ఎవరి నుంచి వచ్చిందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వీరిలో కర్నూలు జిల్లాలో 30, గుంటూరు జిల్లాలో 21, కృష్ణా జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 3 వంతున ఉన్నారు. వైరస్‌ వచ్చిన వారిలో కొందరు అంతకుముందు వారు ఎక్కడ తిరిగారో, ఎవర్ని కలిశారో సరిగా చెప్పలేకపోతున్నందున వివరాలు కనుగొనడంలో సమస్యలు వస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇదీ చదవండీ... కరోనా లేకపోతే ఇప్పటికే ఆ పని చేసేవాళ్లం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.