తీసుకున్న అప్పు చెల్లించకలేకపోతున్నానని ఒకరు... వృద్ధ్యాప్యంలో ఒంటరిగా ఉండాల్సి వస్తుందని మరొకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో జరిగింది. పట్టణంలోని చంద్రమౌళి నగర్లో నివాసముంటున్న సైదాబీ(57) అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె... భర్త చనిపోవడం వల్ల కొద్దిరోజుల క్రితం గుంటూరు వచ్చి ఇక్కడే కొడుకుతో కలిసి నివాసముంటోంది. అయితే అర్ధరాత్రి ఆమె చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు ఖాసీం.. పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అప్పు తీర్చలేక ఆత్మహత్య...
మారుతి నగర్‌కు చెందిన పాండు రంగారావు (42)... ఓ ప్రైవేట్ సంస్థలో రూ. 15 లక్షలు అప్పుగా తీసుకుని కోరిటిపాడు సెంటర్లో రెండు సెలూన్ షాపులు పెట్టాడు. అయితే ఈ మధ్య చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా ఒక దుకాణాన్ని తొలగించారు. మరో దుకాణం కూడా లాక్డౌన్ వల్ల సరిగ్గా నడవలేదు. తీసుకున్న అప్పు బాగా పెరిగిపోయింది. తిరిగి చెల్లించలేమని మనోవేదనకు గురయ్యాడు. ఇంటిలో ఎవరూలేని సమయంలో లుంగీతో ఉరేసుకున్నాడు. గమనించిన కుమారుడు... స్థానికుల సహాయంతో అతనిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి:
ప్రియుడి కిడ్నాప్‌కు ప్రియురాలు యత్నం.. యువకుడి తండ్రి మృతి