Thieves tried to theft in sbi: గుంటూరు జిల్లా ఫిరంగిపురం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు గోడకు ఉన్న ఇనుప కిటికీ తొలగించి దుండగులు లోపలికి ప్రవేశించారు. ముఖానికి ముసుగులు ధరించిన దొంగలు.. లోపల ఉన్న సీసీ కెమెరా వైర్లను తొలగించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ తాళాలు ధ్వంసం చేసే సమయంలో అలారం మోగింది. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, సిబ్బంది బ్యాంకు వద్దకు చేరుకునే లోగా దుండగులు బ్యాంకు వెనుక నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Medicines: విజయవాడ రైల్వే ఆసుపత్రి ఔషధాల కొనుగోళ్లలో గోల్‌మాల్..!
ఫిరంగిపురం ఎస్‌బీఐలో చోరీకి విఫలయత్నం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
Thieves tried to theft in sbi: ఫిరంగిపురం ఎస్‌బీఐలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. వెనుక కిటికీలోనుంచి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దుండగులు... స్ట్రాంగ్ రూమ్ వద్ద అలారం మోగడంతో వెనుదిరిగారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.