ETV Bharat / city

'ఏలూరు' బాధితులకు వైద్య పరీక్షలు: నిలకడగా ఆరోగ్యం - guntur city latest news

గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న ఏలూరు బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితులకు ఎమ్.ఆర్.ఐ. స్కాన్​తోపాటు ఇతర పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు.

Eluru victims
Eluru victims
author img

By

Published : Dec 6, 2020, 8:11 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన ఏలూరు బాధితుల్లో ఐదుగురిని మెరుగైన వైద్య చికిత్సల కోసం గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. బాధితులకు ఎమ్.ఆర్.ఐ. స్కాన్​తోపాటు ఇతర పరీక్షలు నిర్వహించారు. ఐదుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. అవసరమైన వైద్యసహాయాన్ని అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి సూచనల మేరకు సీఎస్ఆర్ఎంవో సతీశ్ కుమార్ వైద్య చికిత్సలను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఏలూరులో ఏం జరుగుతోంది?... ప్రజల అస్వస్థతకు కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.