ETV Bharat / city

గుంటూరు విధానం భేష్‌..!

author img

By

Published : May 10, 2020, 11:21 AM IST

కరోనా బాధితులకు ఉన్న సంబంధాలు, గుర్తింపు విషయంలో గుంటూరు జిల్లా యంత్రాంగాన్ని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది.

the-central-medical-team-has-praised-the-guntur-district-administration
గుంటూరు విధానం భేష్‌

బాధితులకు ఉన్న సంబంధాలు, గుర్తింపు (కాంటాక్టు, ట్రేసింగ్‌) విషయంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం అనుసరించిన విధానాన్ని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది. యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఈ బృందం శనివారం గుంటూరులో అధ్యయనం చేసింది. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలను పరిశీలించనుంది. బృంద సభ్యులు డాక్టర్‌ నందిని భట్టాచార్య, డాక్టర్‌ బాబీపాల్‌ తొలుత జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తీసుకుంటున్న చర్యలను తెలిపారు.

కరోనా కట్టడికి ఇలా చేశాం..

జిల్లాలో తొలి కేసు నమోదు కాగానే పోలీసు, వైద్య యంత్రాంగం బాధితుణ్ని కలిసి ఆయన ఎక్కడెక్కడికి వెళ్లారు? ఆయనతో కలిసి ప్రయాణించిన వారి వివరాలను వాంగ్మూలం రూపంలో తీసుకుందని జిల్లా అధికారులు చెప్పారు. ‘అనుమానితులను సత్వరం గుర్తించి వారికి పరీక్షలు చేయించటంతో వ్యాప్తికి అడ్డుకట్ట వేశాం. వారి సెల్‌ఫోన్లు, వారు ఎక్కడికి వెళ్లారో రైల్వే, ఆర్టీసీ నుంచి సమాచారం సేకరించి ధ్రువీకరించుకున్నాం..’ అని వివరించారు.

ఇవీ చదవండి...కరోనా వ్యాప్తిలో కీలకంగా మారిన కోయంబేడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.