ETV Bharat / city

Compassionate Deaths: 'కారుణ్య మరణాలకు అనుమతివ్వండి' - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Compassionate deaths: కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి తాడేపల్లి రైతులు లేఖ రాశారు. గవర్నర్‌కు పోస్టు కార్డు రాసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూ-1 రిజర్వ్‌ జోన్‌ వల్ల 320 మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్నారని వాపోయారు.

Thadepalli farmers
కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని
author img

By

Published : Apr 29, 2022, 1:18 PM IST

Updated : Apr 29, 2022, 1:57 PM IST

Compassionate deaths: కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి గుంటూరు జిల్లా తాడేపల్లి యూ-1 జోన్ రైతులు ఉత్తరాలు రాశారు. తమ గ్రామంలోని 178 ఎకరాలపై విధించిన యూ-1 రిజర్వ్ జోన్ ప్రభుత్వం తొలగించనందున తమ మరణాలకు అనుమతి ఇవ్వాలని లేఖల్లో పేర్కొన్నారు. యూ-1 జోన్ ఎత్తివేయాలంటూ గత 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదని వెల్లడించారు. గత ఎన్నికల ముందు వైకాపా నేతలు అధికారంలోకి వస్తే యూ-1 జోన్ తొలగిస్తామని హామీ ఇచ్చారని... అధికారంలోకి వచ్చిన తర్వాత తమను మోసం చేశారని తెలిపారు. యూ-1 రిజర్వ్ జోన్ విధించడం వల్ల తమ అవసరాలకు భూమిని అమ్ముకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పక్క పొలం కోట్లు పలుకుతుంటే... యూ-1 జోన్ వల్ల తమ భూమి కేవలం లక్షలకే పరిమితమైందని చెప్పారు. తమ పిల్లల పెళ్లిళ్లకు, ఆరోగ్య సమస్యలకు భూమిని విక్రయించుకోలేకపోతున్నామని వెల్లడించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతైనా కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని.. లేకపోతే కారుణ్య మరణాలకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. యూ-1 రిజర్వ్‌ జోన్‌ తొలగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని.. 320 మంది సన్న, చిన్నకారు రైతు కుటుంబాలను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల్లో 178 ఎకరాలపై యూ-1 జోన్‌లో ఉందని తెలిపారు.

గవర్నర్​కు పోస్టుకార్డులు: కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని గతంలో తాడేపల్లి రైతులు గవర్నర్‌కు పోస్టుకార్డులు రాశారు. యూ-1 జోన్ తొలగించాలని అందులో కోరారు. జోన్​ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని రైతులు పోస్టుకార్డుల్లో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. యూ-1 జోన్ తొలగించాలని తాడేపల్లిలో రైతులు రిలే దీక్షలు చేస్తున్నారు.

యూ-1 జోన్ అంటే..: గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి పరిధిలోని అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్​గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్​ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్​ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి: తెలుగు అకాడమీ విభజన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..?

Last Updated : Apr 29, 2022, 1:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.