ETV Bharat / city

విభజన హామీలపై పార్లమెంట్​లో ప్రశ్నించిన ఎంపీ గల్లా - కరోనా వ్యాప్తి నియంత్రణ, విభజన హామీలపై పార్లమెంట్​లో కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ గల్లా

రాష్ట్ర సమస్యల గురించి పార్లమెంట్​లో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగించారు. కరోనా కట్టడి విషయంలో అధికార వైకాపా బాధ్యతగా వ్యవహరించలేదని ఆరోపించారు. ఏపీ విభజన జరిగి ఇన్నేళ్లైనా ఆ చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం మరచిపోయిందన్నారు.

mp galla questioned center in parliament about ap bifurcation promises
విభజన హామీలపై పార్లమెంట్​లో ప్రశ్నించిన ఎంపీ గల్లా
author img

By

Published : Feb 11, 2021, 10:58 PM IST

విభజన హామీలపై పార్లమెంట్​లో ప్రశ్నించిన ఎంపీ గల్లా

కరోనా కేసుల పెరుగుదలకు ఏపీ గతంలో హాట్​స్పాట్​గా తయారైందని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్​లో ఆరోపించారు. ఒకానొక సమయంలో.. ప్రపంచం వ్యాప్తంగా భారత్​లో అత్యధిక కొవిడ్ కేసులు నమోదు కాగా.. దేశంలోనే ఎక్కువగా ఏపీలో నమోదయ్యాయన్నారు. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. వైరస్ నిర్ధరణ పరీక్షల సమార్థ్యాన్ని పెంచలేదన్నారు. సీఎం జగన్ బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఎందరో ప్రాణాలు కాపాడగలిగేవాళ్లమన్నారు.

ఏపీ విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని పార్లమెంట్​కు ఎంపీ తెలిపారు. విభజన జరిగిన పదేళ్లలోపు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సి ఉందని గుర్తు చేశారు. ఇంకో రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెడితే ఆ సమయం పూర్తవుతుందన్నారు. విభజన హామీలు నెరవేర్చడంపై మరొక ప్రత్యేక చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు సాధిస్తామంటూ.. వైకాపా అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్​ నాటికీ.. వారింకా కేంద్రాన్ని బతిమాలుతూనే ఉన్నారన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని మరో ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. వారికి అధికారం కట్టబెట్టి ఏపీ ప్రజలు ఏం సాధించారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.