ETV Bharat / city

అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై తెదేపా నేతల ఆందోళన

అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును తెదేపా నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. అచ్చెన్నకు ఏదైనా జరిగితే సీఎం సమాధానం చెప్పాలన్నారు.

tdp leaders visit ggh for actchhenaidu
జీజీహెచ్​కు తెదేపా నేతలు.. అచ్చెన్నాయుడుకి పరామర్శ
author img

By

Published : Jun 29, 2020, 12:21 PM IST

Updated : Jun 29, 2020, 1:17 PM IST

అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై తెదేపా నేతల ఆందోళన

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాణాలకు ప్రమాదముందని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు గుంటూరు జీజీహెచ్​కు తెదేపా నేతలు వచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అచ్చెన్నాయుడికి ఏదైనా జరిగితే సీఎం జగనే సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెదేపా నేతలు అన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని విమర్శించారు. జీజీహెచ్​కు కరోనా కేసులు వస్తున్నాయని.. అచ్చెన్నకు కొవిడ్ టెస్ట్ చేయాలని వైద్యులను కోరారు. అయితే అచ్చెన్నాయుడికి ఇప్పటికే 2 సార్లు పరీక్ష నిర్వహించామని డాక్టర్లు తెలిపారు.

ఇవీ చదవండి...

హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రిలో కేంద్రం బృందం పరిశీలన

Last Updated : Jun 29, 2020, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.