రాష్ట్రవ్యాప్తంగా భారీగా కురిసిన వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(tdp mla payyavula keshav visited flood affected areas) అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉరవకొండ నియోజకవర్గవ్యాప్తంగా ఐదురోజుల పర్యటనలో భాగంగా.. మంగళవారం వజ్రకరూర్ మండలం చాబాల గ్రామంలో పయ్యావుల పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామలు తిరుగుతూ నష్టపోయిన రైతులను.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసిన ప్రతిపంట నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోందని..పెట్టిన పెట్టుబడి కూడా ఇప్పుడు చేతికిరాని పరిస్థితి ఉందని అన్నారు. పప్పుశెనగ పంట పూర్తిగా దెబ్బతిందని.. వేసిన చెట్టుకు ఒక్క కాయ కూడా రైతుకు అందలేదని అన్నారు. కంది పంటకు చెట్టుపైనే మొలకలు రావడంతో వాటిని అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు తమ పంటలు ఇంత తీవ్రంగా నష్టపోతే ఏ ఒక్క అధికారి కూడా వచ్చి పరిశీలించలేదని పయ్యావుల ముందు రైతులు ఆవేదన చెందారు.
ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలి
పంట పండించి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని.. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర(tdp leader dhulipalla narendra visited flood affected areas) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు ఈ కెవైసీ క్రాప్ బుకింగ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. సకాలంలో అధికారులు ఈ క్రాప్ యాప్లో పేరు నమోదు చేయకపోతే.. అది రైతు బాధ్యత కాదన్నారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు వరి పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన.. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత రైతులకు నష్టపరిహారంతో పాటు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
Kondapally Municipal Chairman: ఛైర్మన్ ఎన్నికపై తొలగని సందిగ్ధత.. మళ్లీ వాయిదా