బీసీ సాధికారత అణచివేసేందుకే ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించింది - ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తాజా వార్తలు
గుంటూరులోని ఎన్టీఆర్ భవన్‌లో స్థానిక ఎన్నికల పర్యవేక్షణ కమిటీలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. బీసీ సాధికారత అణచివేసేందుకే ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించింది చంద్రబాబు ఆరోపించారు. బీసీల రాజకీయ పునాదుల ధ్వంసానికి సీఎం మహాకుట్ర చేశారని తెలిపారు. ఎవరెన్ని పన్నాగాలు పన్నినా బీసీలను అణచి వేయడం అసాధ్యమన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 34 శాతానికి పైగా స్థానాలను బీసీలకే కేటాయించాలని సమావేశంలో నిర్ణయించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
బీసీ సాధికారత అణచివేసేందుకే రిజర్వేషన్లు తగ్గించింది
TAGGED:
స్థానిక ఎన్నికల తాజా న్యూస్