ETV Bharat / city

'అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. అపురూప కట్టడం' - విజ్ఞాన్​ యూనివర్సిటీ తాజా వార్తలు

అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం నిర్మించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అంతరీక్ష కేంద్రం నిర్మాణంపై విజ్ఞాన్​ విశ్వవిద్యాలయం ఉపకులపతి, పద్మశ్రీ ఎంవైఎస్‌ ప్రసాద్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు.

special programs at vignan university on 20 years on space centre

author img

By

Published : Dec 22, 2020, 9:01 PM IST

Updated : Dec 22, 2020, 10:36 PM IST

అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం నిర్మించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రపంచంలో అపురూప కట్టడమని షార్ మాజీ డైరెక్టర్, విజ్ఞాన్​ విశ్వవిద్యాలయం ఉపకులపతి, పద్మశ్రీ ఎంవైఎస్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అమెరికా (నాసా), రష్యా (రోస్‌కాస్మోస్‌), జపాన్‌ (జాక్సా), ఐరోపా దేశాలు (ఇఎస్‌ఏ), కెనడా (సీఎస్‌ఏ) లకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్​ విద్యాసంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఇంఛార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌

Last Updated : Dec 22, 2020, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.