ETV Bharat / city

రెవెన్యూ డివిజన్లుగా సత్తెనపల్లి, రాజాం..! - ఏపీలో నూతన జిల్లాలు

రాష్ట్రంలో మరో రెండు నూతన రెవెన్యూ డివిజన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాంను రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించేలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.సత్తెనపల్లిపై ప్రజాప్రతినిధులు, రాజాం విషయంలో ఓ పారిశ్రామిక సంస్థ ద్వారా వచ్చిన వినతులను ఖరారు చేసే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

ap logo
ap logo
author img

By

Published : Mar 15, 2022, 5:27 AM IST

కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో భాగంగా నూతనంగా మరో రెండు డివిజన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాంను రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించేలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 51 డివిజన్లుండగా ఇటీవల వాటిని 62 చేశారు. వీటికి అదనంగా సత్తెనపల్లి, రాజాంలను రెవెన్యూ డివిజన్లుగా చేయాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు అందాయి. సత్తెనపల్లిపై ప్రజాప్రతినిధులు, రాజాం విషయంలో ఓ పారిశ్రామిక సంస్థ ద్వారా వచ్చిన వినతులను ఖరారు చేసే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

గుంటూరు జిల్లాలో నరసరావుపేట కేంద్రంగా ఏర్పడుతున్న పల్నాడు జిల్లాలో ప్రస్తుతం నరసరావుపేట, గురజాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు కలిసి సత్తెనపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పడే అవకాశముంది. సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, నకరికల్లు, పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాలు దీని పధిలోకి వస్తాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రాజాం, రేగిడి వంగర, సంతకవిటి, చీపురుపల్లిలోని చీపురుపల్లి, గుర్ల, గరివిడి, మెరకముడిదాం, బొబ్బిలి నియోజకవర్గంలోని తెర్లాం కలిపి మొత్తం తొమ్మిది మండలాలతో రాజాంను డివిజన్‌ కేంద్రంగా ప్రకటించే అవకాశముంది.

* కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వచ్చిన వినతులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. కొత్త జిల్లాలకు పేర్ల పరంగా వచ్చిన వినతులపై సానుకూలత ఉండొచ్చునని భావిస్తున్నారు.

* కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల్లో డిప్యూటీ కలెక్టరు హోదా నుంచి అటెండరు స్థాయి వరకు 3,600 మంది ఉద్యోగులు (రెవెన్యూ) ఉన్నారు. వీరిలో 45% మందిని కొత్త జిల్లాలకు పంపనున్నారు. జూనియర్లుగా ఉన్న వారిని రివర్స్‌ సీనియారిటీ విధానంలో కొత్త జిల్లాలకు కేటాయించనున్నారు. దీనికంటే ముందుగా... ఆసక్తి ఉన్న వారిని కొత్త జిల్లాలకు పంపించే విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని వచ్చిన వినతులనూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపైనా త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.

ఇదీ చదవండి: రామగిరిలో పరిటాల సునీత ట్రాక్టర్​ ర్యాలీ.. వైకాపాపై విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.