ETV Bharat / city

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భద్రత చర్యలు - శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భద్రత చర్యలు

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ( Sri Lakshmi Narasimha Swamy Temple) మాఢ వీధుల్లో భారీ వాహనాలు రాకుండా గడ్డెర్లు బిగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు.. ఆలయ ప్రాంగణంలో మరమ్మతులు చేపట్టారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతకు చర్యలు

author img

By

Published : Oct 1, 2021, 5:17 PM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతకు చర్యలు

గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ(Sri Lakshmi Narasimha Swamy Temple) భద్రతకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా.. ఆలయ మాఢ వీధుల్లోకి భారీ వాహనాలు రాకుండా గడ్డెర్లు బిగించారు. మాఢ వీధుల్లో ద్విచక్రవాహనాలు మినహా ఇతర వాహనాల రాకపోకలను నిషేధించారు. ఆలయ భద్రత దృష్ట్యా(safety measurements) భక్తులు, స్థానికులు సహకరించాలని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ హేమమాలిని రెడ్డి కోరారు.

గతంలో కురిసిన భారీ వర్షాలకు ఆలయం ప్రహారి గోడ కూలింది. గోపురం అంతస్తుల గోడలు పగుళ్లు రావడంతో.. అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నగరపాలక అధికారులు, ఆలయ అధికారులు ఆలయ భధ్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి..

YCP Vs PAWAN: 'కాల్​షీట్స్​ లేకపోతేనే పవన్​కు ప్రజలు గుర్తొస్తారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.