ETV Bharat / city

మంగళగిరిలో మాత్రమే నకిలీ చలానాల అక్రమాలు: రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ - గుంటూరు జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారంపై స్పందించిన డీఐజీ శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే నకిలీ చలానాల అక్రమాలు జరిగినట్లు తేలిందని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 7 కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు డీఐజీ తెలిపారు.

fake-challans-in-guntur-district
రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల అక్రమాలు
author img

By

Published : Aug 13, 2021, 3:50 PM IST

మంగళగిరిలో మాత్రమే నకిలీ చలానాల అక్రమాలు

గుంటూరు జిల్లాలో నకిలీ చలానాలల వ్యవహారంపై రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు స్పందించారు. సాఫ్ట్​వేర్​లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని.. కొందరు ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు తనిఖీలు చేశామని.. కేవలం మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే అక్రమాలు జరిగినట్లు తేలిందని వివరించారు.

అక్కడ.. 7 రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ. 7 లక్షల 95 వేల విలువైన నకిలీ చలానాలు జత చేసినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 7 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మరోవైపు.. పాత సాఫ్ట్ వేర్ స్థానంలో అత్యాధునిక సాంకేతికరతో రూపొందించిన కొత్త సాఫ్ట్​వేర్ సోమవారం నుంచి వినియోగంలోకి రానుందన్నారు. ఈ నూతన సాంకేతికతతో ఎలాంటి అక్రమాలు జరగకుండా అరికట్టవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల బాగోతం.. రూ.36 లక్షలకుపైగా అవినీతి

FAKE CHALLANS: నకిలీ చలానాల కుంభకోణం..ప్రభుత్వం అంతర్గత విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.