ప్రజాప్రతినిధులపై దాడులకు ఉసిగొలుపుతూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మద్దాళి గిరిధర్‌రావు మండిపడ్డారు. రాజధాని ముసుగులో ప్రజాప్రతినిధులు, వైకాపా నేతలపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. గుంటూరు లాడ్జి కూడలి వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజధానిగా అమరావతితో పాటుగా కర్నూలు, విశాఖలను కోరుతున్నామని ఎమ్మెల్యే నాగార్జున అన్నారు. ఎంపీ నందిగం సురేష్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు.
ఇదీ చదవండి :