Guntur GGH: గుంటూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీలో సార్జంట్‌గా పనిచేస్తోన్న విశ్వనాథం.. కమీషన్ల కోసం వేధిస్తున్నాడని ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు ఆందోళనబాట పట్టారు. ఆస్పత్రి నుంచి మృతదేహాలను తీసుకువెళ్లాలంటే 20 శాతం వరకు కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిర్దేశించిన ఛార్జీలే వసూలు చేస్తున్నామని.. 20 శాతం కమీషన్ ఇవ్వలేమంటూ డ్రైవర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. కమీషన్ ఇవ్వకపోవడంతో బయట నుంచి అంబులెన్సులు పిలిపిస్తున్నారని.. సదరు ఉద్యోగి సొంత వాహనాన్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు. కమీషన్ ఇవ్వడం లేదని గేటు పాస్ విధానాన్ని తీసుకొచ్చారని వాపోయారు. న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: