ETV Bharat / city

ఆక్సిజన్ ట్యాంకర్ బ్రేక్ డౌన్.. పోలీసుల సాయంతో గమ్యస్థానానికి చేరిక - oxygen news

ఒడిశా నుంచి గుంటూరుకు ప్రాణవాయువును రవాణా చేస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ చెడిపోయింది. హనుమాన్ జంక్షన్ పోలీసులు సమయానికి స్పందించారు. పోలీసుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పి వాహనం సమయానికి గమ్యస్థానానికి చేరుకుంది.

oxygen tanker break down at krishna district
బ్రేక్ డౌన్ అయిన ఆక్సిజన్ ట్యాంకర్
author img

By

Published : May 20, 2021, 12:58 PM IST

ఆక్సిజన్ వాయువును ఒడిశా నుంచి గుంటూరుకు రవాణా చేస్తున్న ట్యాంకర్ ( నెంబర్: AP 31 TB 8127 ) వాహనం.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సెంటర్లో యాక్సిల్ విరిగిపోయి అక్కడే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ ఎస్సై పి.గౌతమ్ కుమార్ వెంటనే మరమ్మతులు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఆక్సిజన్ వాహనం ప్రయాణానికి అంతరాయం లేకుండా దగ్గర్లో ఉన్న రోడ్ సేఫ్టీ మొబైల్ వారి సహాయంతో దానికి తక్షణం మరమ్మతులు చేయించి.. ప్రయాణ మార్గాన్ని సుగమం చేశారు. కోవిడ్ వైద్యశాలల్లో ప్రస్తుతం ఆక్సిజన్ ప్రాముఖ్యత, క్షణం ఆలస్యమైతే జరిగే పరిణామాలను ఆలోచించి ఎస్సై సమయానుకూలంగా స్పందించారు. వారి అప్రమత్తతతో ఆక్సిజన్ ట్యాంకర్ రవాణాకు అంతరాయం ఎదురుకాకుండా... సమయానికి గమ్యస్థానానికి చేరుకుంది.

ఇవీ చదవండి:

ఇల్లు కూలి నలుగురు మృతి

'రూ. 1.60 లక్షలు చెల్లించండి.. అప్పటి వరకూ డిశ్చార్జ్ చేసేది లేదు..!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.