ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇస్తామన్న అధికారుల మాటలకు ఆదిలోనే మంగళం పాడారు వార్డు వాలంటీర్లు. గుంటూరు నగరం నల్లచెరువులోని శంకర్రావు పాఠశాలకు వచ్చి పింఛను తీసుకోవాలని లబ్ధిదారులకు వాలంటీర్లు చెప్పారు. వారి చెప్పిన విధంగా ఉదయాన్నే పింఛన్ల కోసం వస్తే... మధ్యాహ్నం వరకూ పింఛన్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వయసు మీదపడ్డాక అటూ ఇటూ తిప్పుతున్నారని వాపోయారు. అధికారులు జోక్యం చేసుకుని ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే ఫించన్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.