ETV Bharat / city

శాశ్వత స్థలం కోసం పట్టాభిపురం రైతు బజార్ విక్రేతల ఎదురుచూపులు

author img

By

Published : Feb 22, 2021, 9:21 PM IST

గుంటూరు పట్టణంలోని పట్టాభిపురం రైతు బజార్ పరిస్థితి దయనీయంగా మారింది. బంతిని విసిరేసినట్టుగా ప్రభుత్వ శాఖలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రైతుబజార్​ని విసిరివేస్తున్నాయి. వారానికి ఒకసారి రైతు బజార్ మార్చడంపై అటు స్థానికులు, ఇటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

pattabhipuram raithu bazar
పట్టాభిపురం రైతు బజార్

గుంటూరు పట్టణంలోని పట్టాభిపురం రైతు బజార్ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ శాఖలు మార్కెట్​ను ఒకచోట నుంచి మరోచోటుకు తరలిస్తున్నాయి. దీంతో ప్రజలు అయోమయం చెందుతున్నారు.

మొదట్లో స్వామి థియేటర్ వద్ద మెయిన్ రోడ్డు పక్కన రైతు బజార్​ను ఏర్పాటు చేశారు. అయితే కోర్టు ఆదేశాలతో ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించారు. ఆ తర్వాత తాత్కాలికంగా కృష్ణా నగర్ లోని కృష్ణా ఆశ్రమం స్థలంలో రైతు బజార్ నిర్మిస్తామని అప్పట్లో వాగ్దానం చేసి కొంత నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. అయితే అది కూడా రోడ్డు కావడంతో దానిపైన కొందరు వ్యక్తులు కోర్టులో పిటిషన్లు వేయడంతో అర్ధాంతరంగా నిలిపివేశారు. కరోనా లాక్​డౌన్​ సమయంలో విశాలమైన ప్రదేశంలోకి రైతు బజార్​ని మార్చే క్రమంలో బృందావన్ గార్డెన్ ఎన్టీఆర్ స్టేడియంలోకి మార్చారు. అక్కడ వాకర్స్ కు ఇబ్బంది కలుగుతుందని స్టేడియంలోనే స్కేటింగ్ రింగు వద్దకు మార్చారు.

ఇప్పుడు ఏకంగా వేరే స్థలంలోకి రైతు బజారును తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో స్టేడియాన్ని ఖాళీ చేయాలని నగర పాలక సంస్థ అధికారులు రైతులకు చెప్పారు. దీంతో రైతు బజార్ వ్యాపారస్తులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకువచ్చిన కూరగాయలను స్టేడియం బయట ఉన్న మెయిన్ రోడ్డుపై పోసుకుని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా రోడ్డుపైన కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.

దీంతో అటు స్థానికులకు, రైతు బజార్ వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. ఎంతో జనాదరణ కలిగిన రైతుబజార్​ను ఒక ప్రదేశంలో ఏర్పాటు చేయకుండా ఇలా తరచుగా మారుస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయని అటు విక్రేతలు, కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పంట కోసం ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.