గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాను అందుబాటులో ఉంచడం కత్తిమీద సాములా తయారైంది. జీజీహెచ్‌లో ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయన్న సమాచారంతో... విశాఖపట్నం నుంచి హుటాహుటిన ప్రాణవాయువును తరలించారు. ఏలూరు నుంచి విజయవాడ మధ్యలో ఎక్కడా ట్రాఫిక్‌కు ఆటంకాలు లేకుండా పోలీసు అధికారులు... గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. గుంటూరులోనూ పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. నిర్ణీత గడువు కంటే ముందుగానే ఆక్సిజన్ సిలిండర్ లారీ జీజీహెచ్‌కు చేరుకుంది. ప్రస్తుతం జీజీహెచ్‌లో 800కు పైగా పడకలుండగా... ఆక్సిజన్ వినియోగం తారస్థాయికి చేరింది. అందుకే డిజిటల్ మీటరింగ్ సిస్టం ద్వారా ఆక్సిజన్ నిల్వలు కనిష్ఠస్థాయికి పడిపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండీ... 104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేసేలా చర్యలు: ప్రభుత్వం