ఆపరేషన్ ముస్కాన్, కొవిడ్ -19 పై అవగాహన కార్యక్రమాన్ని గుంటూరు అర్బన్ - రూరల్ పోలీసులు ప్రారంభించారు. పట్టణ పరిధిలో మొత్తం 30 మంది వీధి బాలలు, అనాదరణకు గురైన బాలబాలికలు, బాల కార్మికులను గుంటూరు అర్బన్ పోలీసులు గుర్తించారు. వీరిని సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ సుగుణాలరాణి ముందు ప్రవేశపెట్టారు. ఆమె విచారణ అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వారి తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించారు.
కరోనా వైరస్ వ్యాప్తి గురించి అవగాహన కల్పించారు. అనంతరం మాస్కులు, శానిటైజర్లు, పేస్టులు, సి విటమిన్ ట్యాబ్లెట్లు, చాక్లెట్లు, బ్రష్లు మొదలైన వాటిని పోలీసులు అందచేశారు. ఇప్పటి వరకు గుంటూరు గ్రామీణ జిల్లా పరిధిలో 64 మంది బాలురు, 14 మంది బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: