ETV Bharat / city

ఇదీ సంగతి: ఆ గ్రామాలు నేరాలు, వివాదాలకు అమడ దూరం

నేటికీ వివాద, నేర రహిత గ్రామాలు ఉన్నాయంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ నమ్మి తీరాల్సిందే. వీటి స్ఫూర్తి, ప్రజల కట్టుబాట్లు మిగిలిన పల్లెలకు నిజంగా ఆదర్శనీయం. సాధారణ రోజుల్లోనే కాదు.. ఎన్నికల వేళ కూడా పోలీస్‌స్టేషన్లకు వెళ్లిన సందర్భాలు లేవు. ఇంతకీ ఆ గ్రామాలేవి? అక్కడి ప్రజల మధ్య భేదాభిప్రాయాలు వస్తే వాటిని పోలీసుస్టేషన్‌ గుమ్మం తొక్కకుండా ఎలా పరిష్కరించుకుంటున్నారో తెలుసుకుందామా!

author img

By

Published : Feb 9, 2021, 10:50 AM IST

ap local polls
ఏపీ స్థానిక ఎన్నికలు 2021

లింగాపురం, కొత్తమల్లాయిపాలెం.. గుంటూరు జిల్లాలోని గ్రామాలు. మాచర్ల మండల పరిధిలో లింగాపురం ఉంటే... ప్రత్తిపాడు మండల పరిధిలో కొత్తమల్లాయిపాలెం ఉంది. ఈ రెండు గ్రామాలు వివాదాలు, నేరాలకు అమడ దూరం. ఈ గ్రామాల్లోని ప్రజల మధ్య కక్షలు, కార్పణ్యాలు, రాజకీయవర్గ పోరు, ముఠా తగాదాలు, సామాజిక వర్గాల మధ్య ఘర్షణలకు తావుండదు. కొట్లాడుకునో లేదా ఇంకేమైనా కారణాలతోనో పోలీసు స్టేషన్లకు వెళ్లిన ఉదంతాలు మచ్చుకు లేవు.

ఈ రెండు గ్రామాల నుంచి పాస్‌పోర్టు కోసం, ఇంకేదైనా ఉద్యోగాలకు ఎంపికైతే వారికి సంబంధించిన నేరచరిత్ర గురించి తెలుసుకోవడానికి పోలీసులు సైతం ఏమాత్రం ఆందోళన చెందరు. ఆ గ్రామాల నుంచి వెరిఫికేషన్లు వచ్చాయంటే చాలు.. కళ్లు మూసుకుని యంత్రాంగం ఎలాంటి కేసుల్లేవని నిర్భయంగా నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

లింగాపురం....

లింగాపురం....

గ్రామం: లింగాపురం మండలం: మాచర్ల

నియోజకవర్గం: మాచర్ల

పోలీసు పరిధి: గుంటూరు రూరల్‌ జిల్లా పోలీస్‌

జనాభా: 600(సుమారు)

నాగార్జునసాగర్‌కు పక్కనే ఉన్న కుగ్రామమిది. అల్పాదాయవర్గాలకు చెందిన ప్రజలే ఎక్కువగా ఈ గ్రామంలో ఉన్నారు. అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సాగర్‌ నీటితో ఏడాది పొడవునా సేద్యం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం పొలాల్లోనే గడుపుతారు. ఏదైనా విషయమై గ్రామంలో యువకులు, పెద్దల మధ్య భేదాభిప్రాయాలు వస్తే వాటిని పెద్దల సమక్షంలోనే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటామని, అసలు స్టేషన్లకు వెళ్లమని ఆ గ్రామ పెద్ద గోగు కృష్ణయ్య వివరించారు. ఈ విధానం మా పెద్దల నుంచి వస్తోందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటాం. పోటీ ద్వారా సర్పంచిని ఎన్నుకోవడం అనేది రెండు దశాబ్దాల నుంచి లేదు. ఈసారి ఏకగ్రీవం కోసమే చర్యలు తీసుకుంటున్నాం.

కొత్తమల్లాయిపాలెం కథ ఇలా...!

గ్రామం: కొత్తమల్లాయిపాలెం మండలం: ప్రత్తిపాడు

నియోజకవర్గం ప్రత్తిపాడు

పోలీసు పరిధి: గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీస్‌

జనాభా: 800 (సుమారు)

ఈ ఊళ్లో అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన ఓ సామాజికవర్గం ప్రజలే అత్యధికంగా ఉన్నారు. గ్రామస్థుల మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చినా పెద్దల సమక్షంలోనే కూర్చొని మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకుంటామని గ్రామానికి చెందిన సింగారెడ్డి లక్ష్మారెడ్డి వివరించారు. ‘మా సామాజిక వర్గంలోనే కాదు.. గ్రామంలో ఉన్న మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన వారి మధ్య ఏమైనా సమస్యలు వస్తే మేమంతా కలిసి సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. పెద్దల మాటను కాదని ధిక్కరించిన సందర్భాలు లేవు. గడిచిన దశాబ్దంన్నర నుంచి పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమవుతున్నాయి. చిన్న పంచాయతీ.. ఆస్తి పన్నుల రూపేణా వచ్చే ఆదాయం తక్కువ. దీంతో ప్రభుత్వమిచ్చే ఏకగ్రీవ పంచాయతీ ప్రోత్సాహక నగదుతో మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే ఆలోచనతో ప్రతిసారి ఎన్నికలను ఏకగ్రీవం దిశగా చర్యలు తీసుకుంటున్నామని’ చెప్పారు.

ఇదీ చదవండి

పల్లె పోరు: ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.