NABARD Chairman: నాబార్డు నుంచి అత్యధికంగా వ్యవసాయానికి రుణాలు ఇస్తున్నామని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. నాబార్డు నుంచి రూ.6 లక్షల 50 వేల కోట్లు రుణం ఇచ్చామని చెప్పారు. రైతు వ్యవసాయం చేయాలంటే రుణాలు తప్పక అవసరమన్నారు. దేశంలో ఏది ఆగినా వ్యవసాయం ఆగదని.. అందుకే రుణాలు పెంచినట్లు వెల్లడించారు.
NABARD Chairman: చిరు ధాన్యాలను ప్రోత్సాహించాలే గానీ.. వరి పంటను తీసేయకూడదన్నారు. అన్ని రకాల పంటలనూ పండించాలని సూచించారు. భూమిని సంరక్షికుంటూ సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని సూచించారు.
రైతునేస్తం ఫౌండేషన్.. వ్యవసాయంలో పాత పద్ధతులను పాటిస్తూ.. మంచి పంటలు పండించేలా కృషి చేస్తోందన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. నిర్వహించిన సేంద్రియ సాగుపై రైతుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన పంట ఉత్పత్తులను పరిశీలించారు.
ఇదీ చదవండి: సామాన్యుడి సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్ పాలన: స్పీకర్ తమ్మినేని