MP Mopidevi Venkata Ramana Rao: తెదేపా హయాంలో చేసిన అప్పులన్నీ... వైకాపా వచ్చాకే చెల్లించిందని ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం అప్పుల పాలైందని ప్రతిపక్ష నేతలు విమర్శించడం సరికాదని మండిపడ్డారు.
ఏ ప్రభుత్వం అయినా అప్పులు తీసుకోవడం.. తిరిగి చెల్లించడం సర్వసాధారణం అని చెప్పారు. బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులూ లేవని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం దారుణమని మండిపడ్డారు.
MP Mopidevi Venkata Ramana Rao: అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. అభివృద్ధి పనులు ఆగిపోకుండా.. కాంట్రాక్టర్లకు బకాయిల చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు.
కార్పొరేషన్ నిధులు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు నూతన జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి: Death Toll: జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన నాటుసారా మరణాలు!