ETV Bharat / city

అరాచక పాలనకు చరమగీతం పాడాలి: గల్లా జయదేవ్‌ - జగన్​పై గల్లా జయదేవ్ కామెంట్స్

వైకాపా అరాచక పాలనకు మున్సిపల్ ఎన్నికల నుంచే చరమగీతం పాడాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంతో పాటు, తెనాలి మున్సిపాలిటీలో పోటీచేస్తున్న తెదేపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.

mp galla jayadev comments on ysrcp govt
mp galla jayadev comments on ysrcp govt
author img

By

Published : Mar 2, 2021, 4:24 PM IST

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలను ప్రజలంతా చూశారని, వాటిని అడ్డుకోవాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని గల్లా జయదేవ్ కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. తెనాలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్త్రీ బండి వద్ద కాసేపు దుస్తులు ఇస్త్రీ చేశారు. వెల్డింగ్‌ షాపు వద్ద కార్మికులతో మాట్లాడారు. జయదేవ్‌తో పాటు గుంటూరు తూర్పు తెదేపా ఇన్‌ఛార్జి నసీర్‌ అహ్మద్‌, తెనాలి ఇన్‌ఛార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

.
.

ఇదీ చదవండి: రేషన్‌ వాహనాల రంగు మార్పుపై పిటిషన్.. డిస్పోజ్‌ చేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.