ప్రధాని మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు అడుగునా ఆటంకాలు కల్గించడం హేయమైన చర్య అని భాజపా నేత వళ్లూరు జయప్రకాష్ ఆరోపించారు. ఈ నెల 10న నరేంద్రమోదీ గుంటూరులో పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని... భారీ బందోబస్తు నడుమ సభ జరుగుతుందన్నారు. తెదేపా నేతలు మోదీకి భయపడి స్వచ్చందంగా వస్తున్నా ప్రజలను అడ్డుకొని అనేక ఇబ్బందులుకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 10న జరిగే సభకు భాజపా కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)