ETV Bharat / city

తాడికొండలో ఆగని ఆందోళనలు, ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుల అరెస్ట్​

MLA Undavalli Sridevi వైకాపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్​ను తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మేడికొండూరులో శ్రీదేవి అనుచరుల మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

mla-sridevis-followers-were-detained-by-the-police
వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Aug 23, 2022, 7:40 PM IST

MLA Undavalli Sridevi followers protest: గుంటూరు జిల్లా మేడికొండూరులో వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి అనుకూల వర్గాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడికొండ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్​ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్​ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

డొక్కా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో.. సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని శ్రీదేవి అనుకూల వర్గం గుర్తు చేశారు. వరప్రసాద్​ని ఇంచార్జ్​గా నియమించడం వల్ల వైకాపాలో వర్గాలు ఏర్పడుతాయని అభిప్రాయపడ్డారు. డొక్కాను ఇంచార్జ్ బాధ్యత నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వేరే ఎవరైనా కొత్త వ్యక్తులను నియమించాలని అన్నారు. ఏ తప్పు లేకుండా నాయకులను పోలీస్ స్టేషన్​కు తరలించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.