గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో కంటైన్మెంట్ జోన్ల సంఖ్యను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై రెవెన్యూ, పోలీస్, వైద్య, కార్పొరేషన్ అధికారులతో సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్, మంగళగిరి శాసనసభ్యులు సమీక్ష నిర్వహించారు.
బుధవారం ఒక్క రోజే నియోజకవర్గంలో 500 లకు పైగా కేసులు నమోదు కావడంతో.. మంగళగిరిలోని 32, తాడేపల్లిలోని 20 వార్డుల్లో ఉన్న మైక్రో కంటైన్మెంట్ జోన్లను పూర్తిస్థాయి కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్ది తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నారై ఆస్పత్రిలో అదనంగా 150 పడకలు పెంచగా.. గుండిమెండలో 100 ప్రైవేటు అతిథి గృహాలను, కేఎల్ విశ్వవిద్యాలయంలోని బాలుర వసతి గృహాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: