చెల్లెలు వరసైన ఓ బాలికపై కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పొన్నూరు మండలానికి చెందిన బాలిక చింతలపూడి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. వరసకు అన్నయ్యే కదా అని గోపితో చనువుగా ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఇదే అదునుగా భావించిన గోపి తనను బాపట్ల తీసుకువెళ్లి మోసం చేసినట్లు బాధితురాలు వాపోయింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు చెప్పింది. జనవరి 20న కుటుంబ సభ్యులు అందరూ శుభకార్యానికి వెళ్లిన సమయంలో మరోసారి తనపై ఆఘాయిత్యానికి ఒడిగట్టాడని బాలిక వివరించింది. దీనిపై పొన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. తనకు న్యాయం చేయాలని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు గ్రామీణ ఎస్పీని కోరింది. కేసును బాపట్ల డీఎస్పీకి బదిలీ చేసి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: