ETV Bharat / city

Minister Vellampalli on Madipadu Incident: 'మృతుల కుటుంబాలను ఆదుకుంటాం' - madipadu incident dead bodies

Minister vellampalli srinivas in GGH : గుంటూరు జిల్లా మాదిపాడు వద్ద కృష్ణా నదిలో మునిగి మృతిచెందిన వారి మృతదేహాలను మంత్రి వెల్లంపల్లి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంత్రి వెల్లంపల్లి
మంత్రి వెల్లంపల్లి
author img

By

Published : Dec 11, 2021, 1:18 PM IST

Minister vellampalli srinivas in GGH : గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద కృష్ణా నదిలో మునిగి మృతిచెందిన ఐదుగురు వేద విద్యార్థులు, ఉపాధ్యాయుడి మృతదేహాలను.. జీజీహెచ్​లో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం దురదృష్ణకరమని వ్యాఖ్యానించారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని.. చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు.

మంత్రి వెల్లంపల్లి

ఐదుగురు విద్యార్థులు సహా ఒక ఉపాధ్యాయుడు మృతి చెందడం బాధాకరం. ఈ ఘటనలో మృతి చెందినవారి మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. వారి తల్లిదండ్రులు, బంధువులను సంప్రదిస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. - వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి

సరదాగా ఈతకు వెళ్లి...

students death in guntur : గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాడిపాడు వద్ద పెనువిషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని శ్వేత శృంగాచలం వేద వేదాంత గురుకుల వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కృష్ణా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈత రాకపోవడంతో వారంతా నదీ ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు, గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా... ఆరుగురి మృత దేహాలు లభ్యమయ్యాయి.

ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం శర్మ, హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమాన్ శుక్లా, శివ శర్మ, నితీష్ కుమార్​లు మృతి చెందినట్లు గుర్తించారు. వీరిలో సుబ్రహ్మణ్యం శర్మ నరసరావుపేట, శివ శర్మ మధ్యప్రదేశ్ చెందిన వారు కాగా... మిగిలిన నలుగురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఈ ఘటనలో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గవర్నర్ దిగ్భ్రాంతి...

students death in guntur : వేదపాఠశాల విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రతపై సంస్థల నిర్వాహకులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.