పేదల సొంతింటి కళ నెరవేర్చడంతోపాటు..ఇళ్ల నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు చేస్తోంది వైకాపా ప్రభుత్వమేనని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఒక్కో ఇంటికి రూ.4 లక్షల విలువైన స్థలంతోపాటు నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. గుంటూరు కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో మంత్రి శ్రీరంగనాథరాజు సమీక్షించారు. ఈ సందర్భంగా.. పౌరసరఫరాలశాఖ, ఉపాధ్యాయుల డిప్యుటేషన్ల అంశంపై చర్చించారు. పేదల కోసం ఎంతో ఖర్చు భరించి రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంటే.. కొందరు రేషన్ బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. డీలర్లు ఎవరూ బియ్యం అక్రమ రవాణా చేయడం లేదని స్పష్టం చేశారు. అనర్హుల వద్దే ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నట్లు పేర్కొన్న ఆయన అనర్హుల ఏరివేత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇసుక, సాగునీటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలో పరిష్కరిస్తామన్నారు.
ఇదీ చదవండి..
ISO Certificates: తితిదే ఆధ్వర్యంలోని కళాశాలలకు ఐఎస్వో గుర్తింపు