పట్టణాల్లో అస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు ఆరోపించారు. గుంటూరులో మాట్లాడిన ఆయన... రాజకీయ లభ్ది కోసమే అస్తి పన్నుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆస్తి పన్నుపై 10 నుంచి 15 శాతం మాత్రమే పెంపు ఉంటుందని.. ఇందుకు చంద్రబాబు సైతం అసెంబ్లీలో ఆమోదం తెలిపారని ఆయన గుర్తు చేశారు.
ఆర్థిక రాజధాని గుంటూరును తెదేపా హయాంలో పూర్తిగా విస్మరించారని.. తమ ప్రభుత్వ నగరానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి హామీనిచ్చారు. నగరంలో 67వేల మందికి గృహనిర్మాణాల కోసం 1100 ఎకరాల స్థలాన్ని సేకరించామన్నారు. 67 ఏళ్ల నాటి శంకర్ విలాస్ పైవంతనను 6 లైన్లుగా విస్తరిస్తామని చెప్పారు. పేదలకు కేటాయించిన జగనన్న కాలనీలను సకల సదుపాయాలతో మోడల్ కాలనీలుగా మారుస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ వైకాపాకే పట్టం కట్టాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి