గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీరంగనాధరాజు పర్యటించారు. రోగుల సహాయకులకు రెండు పూటలా ఉచితంగా భోజనం అందించే భోజనశాల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పూర్తి హంగులతో ఈ భోజనశాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి.. నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు.
ఈ నిర్మాణానికి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీరంగనాధరాజు ఇప్పటికే కోటి రూపాయలను సొంత నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. రోగుల సహాయకుల భవన నిర్మాణంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతికి మంత్రి శ్రీరంగనాధరాజు కొన్ని సూచనలు ఇచ్చారు.
తితిదేకు గుదిబండగా మారుతున్న శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్..!