పోలవరం ప్రాజెక్టు వద్ద విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఉన్న ఆత్రుత... ప్రాజెక్టును పూర్తి చేయడానికి లేదని ఏపీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి.. పోలీసులు అడ్డుకోవడంతో పట్టాభిపురం పోలీస్స్టేషన్లో ఉన్న సీపీఐ నేతలను, అమరావతి ఐకాస నేతలను ఆయన పరామర్శించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లకుండా సీపీఐ నేతలను అడ్డుకునే హక్కు ఎవరు ఇచ్చారని మస్తాన్ వలి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవానాడీ అని వివరించారు. పోలవరం ప్రాజెక్టును త్వరతిగతిన పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... పోలవరం ఏమైనా నిషిద్ధ ప్రాంతమా?: చంద్రబాబు