ETV Bharat / city

మిగిలిన 19 మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు: ఉప సభాపతి - పురపాలక ఎన్నికలు 2021

ఏపీలో విలీన గ్రామాల సమస్యతో ఆగిపోయిన 19 మున్సిపాలిటీల ఎన్నికలు... మే నెలలో జరిగే అవకాశం ఉందని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు.

Kona Raghupathi
ఉపసభాపతి కోన రఘుపతి
author img

By

Published : Mar 23, 2021, 3:39 PM IST

రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలకు మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు ఉపసభాపతి కోన రఘుపతి. బాపట్లతోపాటు రాష్ట్రంలో 19 పురపాలికల్లో ఎన్నికలు విలీన గ్రామాల సమస్యతో ఆగిపోయాయని చెప్పారు. అవన్నీ కూడా పరిష్కారమై త్వరలో ఎన్నికలు జరుగుతాయన్నారు.

బాపట్లలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా విజయం తథ్యమని విశ్వాసం వెలిబుచ్చారు. రాష్ట్రమంతా అదే ఒరవడి కొనసాగుతుందన్నారు. బాపట్లలో వైద్యకళాశాల నిర్మాణం కోసం రూ.475 కోట్ల పరిపాలనా అనుమతులు వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

ఇదీ చదవండి:

పెరిగిన దాణా ధర.. కన్నీటి సంద్రంలో రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.