ప్రముఖ కథారచయిత, కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు (కారా) మృతిపట్ల ఎమ్మెల్సీ, మహాకవి జాషువా కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. కాళీపట్నం రామారావు అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన 'కారా' చిరస్మరణీయులని కొనియాడారు. మహాకవి జాషువాకు అభిమాని అని.. జాషువా కవిత్వాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి జాషువా కళాపీఠం తరపున తాము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని కారా తన అభిమానాన్ని చాటుకొనే వారన్నారు. కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాస్టారు.. నిరాడంబరమైన జీవితాన్ని గడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు.
ఇదీ చదవండీ... Amul Pala Velluva: పశ్చిమగోదావరిలో 'అమూల్ పాల వెల్లువ' ప్రారంభం